పాక్ రక్షణ కార్యదర్శిగా యాసిన్ మాలిక్
ఇస్లామాబాద్: పాకిస్థాన్ రక్షణ శాఖ కార్యదర్శిగా ఆర్మీ చీఫ్ జనరల్ అష్ఫాఖ్ పర్వేజ్ కయానీ సన్నిహితుడు విశ్రాంత లెప్టినెంట్ జనరల్ అసిఫ్ యాసిన్ మాలిక్ నియమితులయ్యారు. గిలానీ సన్నిహితురాలు, రక్షణ శాఖ అదనపు బాధ్యతలు చూస్తున్న నర్గీస్ సేధి కేబినెట్ కార్యదర్శిగా కొనసాగుతారని ఆ ప్రకటనలో పేర్కొంది. గిలానీ నియమించిన అక్రమ్ షాహిది స్థానంలో ప్రధాని రాజా పర్వేజ్ అష్రాఫ్ ప్రెన్ కార్యదర్శిగా షాకత్ జలీల్‌ను నియమించారు.