పార్టీ కోసం వచ్చిన నిధులను సొంతానికి వాడుకోవటం తప్పు : చంద్రబాబు

హైదరాబాద్‌: రాజకీయ పార్టీలకు కార్పొరేట్‌ సంస్థలు ఫండింగ్‌ ఇవ్వటం తప్పు కాదని, పార్టీ కోసం వచ్చిన నిధులను సొంతానికి వాడుకోవటం తప్పన్నారు. పార్టీ ఫండ్‌గా నల్లధనం రావటం ప్రమాదకరమన్నారు. తానెంతో పారదర్శకంగా ఉన్నానని, అందుకే కుటుంబ సభ్యులతో సహా ఆస్థుల వివరాలు వెల్లడిస్తున్నానన్నారు. లోకేష్‌ రాజకీయాల్లో క్రియా శీలపాత్ర పోషిస్తారా అన్న ప్రశ్నపై స్పందిస్తూ కార్యకర్తగా పనిచేసే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందన్నారు.