పాల ధర తగ్గింపు

ఖమ్మం, జూలై 19 : ఎపి డెయిరీ విజయ పాల ధరను లీటర్‌కు రెండు రూపాయల చొప్పున ధర తగ్గించిందని ఖమ్మం డెయిరీ ఉపసంచాలకులు మోహన్‌మురళీ, మేనేజర్‌ రవికుమార్‌ తెలిపారు. ఒక ఖమ్మం జిల్లాలోనే ఈ ధరలను తగ్గించడం విశేషం. ఖమ్మంలోని విజయా పాల డెయిరీ ద్వారా రోజుకు 3 వేల లీటర్ల పాల విక్రయం జరుగుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ పాడిపరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య ఇటీవల పాల ధరను లీటర్‌కు రెండు రూపాయల చొప్పున పెంచుతూ సంస్థ ఎండి మహ్మద్‌ ఆలి రసత్‌ ఆదేశాలు జారీ చేశారు. ఆ పెంచిన ధరలను మన ఖమ్మం జిల్లాలో తగ్గించారు. దీంతో పాల వినియోగదారులకు ఒకింత ఊరట లభించింది.