పీజీ మెడికల్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ పూర్తి

విజయవాడ, మే 27 (జనంసాక్షి):

పీజీ తుది విడత కౌన్సెలింగ్‌ పూర్తయింది. మొత్తం 90 సీట్లను ఇన్‌సర్వీస్‌ అభ్యర్థులతో భర్తీ చేసినట్లు ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ రిజిస్టార్‌ ప్రొఫెసర్‌ వేణుగోపాలరావు తెలిపారు. దీంతో పిజి మెడికల్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ పూర్తయిందని ఆయన పేర్కొన్నారు. ఏప్రిల్‌ నెలలో తొలి విడత, మే నెలలో మలి, తుది విడత కౌన్సెలింగ్‌ నిర్వహించి సీట్లన్నీ భర్తీ చేశామన్నారు. ఈ పర్యా యం ఎటువంటి న్యాయపరమైన సాంకేతిక పరమైన వివాదాలు, సమస్యలు తలెత్తలేదని, అంతాసౌ వ్యం గా జరిగిందని ఆయన చెప్పారు. జూన్‌ 1వ తేదీ నుండి పిజి మెడికల్‌ తరగతులు ప్రారంభమవు తాయ వెల్లడించారు. కళాశాలకు కేటాయించిన విద్యార్థులు ఆ కళాశాలలో వెంటనే చేరాలని ఆయన కోరారు.