పెంచిన ఆర్టీసీ ఛార్జీలను తగ్గించాలని తెలుగుదేశం ఆందోళన
గుంటూరు: పెంచిన ఆర్టీసీ ఛార్జీలను, తగ్గించాలని డిమండ్ చేస్తూ తెలుగుదేశం రాష్ట్రంలో పలుచోట్ల ఆందోళనకు దిగింది. హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో బస్‌డిపో ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించింది. ఈ ఆందోళనతో దిల్‌సుఖ్‌నగర్‌లో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. గుంటూరు జిల్లా చిలకలూరి పేట జాతీయ రహదారిపై తెలుగుదేశం ఆందోళనతో ఇరువైపులా వాహన రాకపోకలు స్తంభించాయి.