పెట్రోల్‌ ధర మరో 70పైసలు పెరిగింది!

న్యూఢిల్లీ, జూలై 23: మరోమారు పెట్రోల్‌ ధర పెరిగింది. లీటరుకు 70 పైసల వంతున పెంచుతూ చమురు సంస్థలు, కేంద్రం సోమవారంనాడు నిర్ణయం తీసుకున్నాయి. ఈ పెంపు సోమవారం అర్ధరాత్రి నుంచి దేశవ్యాప్తంగా అమలులోకి రానున్నట్టు పేర్కొన్నాయి.