పేదింటి ఆడబిడ్డల వివాహాలకు అండగా .
★ పుస్తే మట్టెలను అందజేసిన బబ్బూరి శ్రీకాంత్ గౌడ్..
★ పదుల సంఖ్యలో వివాహానికి పుస్తె,మట్టెలు … ఆర్థిక సహాయం
★ అందరికి ఆదర్శంగా పెద్దమడుర్ యూవ నాయకుడు
దేవరుప్పుల,10 (జనం సాక్షి):* పేదింటి ఆడబిడ్డల వివాహాలకు పుస్తే మట్టేలు అందజేస్తూ వారి కుటుంబాలకు అండగా నిలుస్తున్నాడు పెద్దమడూరు గ్రామానికి చెందిన ‘యువ నాయకుడు బబ్బురి శ్రీకాంత్ గౌడ్’.*
ఇప్పటికే పదుల సంఖ్యలో పేదింటి ఆడబిడ్డల వివాహాలకు పుస్తె మట్టేలు అందజేసి వారి కుటుంబాలకు అండగా నిలిచాడు.దేవరుప్పుల మండలం,పెద్దమడూరు గ్రామానికి చెందిన పానుగంటి రేణుక-సాయిలు దంపతుల కూతురు చైతన్య, బెజగం మల్లమ్మ-మల్లయ్య దంపతుల కూతురు భవానిల వివాహ మహోత్సవం సందర్భంగా ఇరువురికి పుస్తె మట్టెలు అందజేశారు.వివాహానికి చేయూతనందించిన బబ్బురి శ్రీకాంత్ గౌడ్ ను వధూవుల తల్లిదండ్రులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్న బబ్బురి శ్రీకాంత్ గౌడ్ ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు అభినందించారు.
ఈ కార్యక్రమంలో బబ్బురి యాదగిరి, కారుపోతుల శ్రీనివాస్, బబ్బురి నాగరాజు, గ్రామ రైతు కోఆర్డినేటర్ ఆకవరం పెద్దారెడ్డి, ఉపసర్పంచ్ మానుపాటి వెంకటేష్, మండల పార్టీ ఉపాధ్యక్షుడు నల్ల ఉమేష్, గ్రామ పార్టీ అధ్యక్షుడు బండారి రాములు, మాజీ ఎంపీటీసీ జోగు బిక్షపతి, నాయకపు శేఖర్, చంద్రగిరి సంపత్, పెద్దగోని వెంకటయ్య, బబ్బురి రవి, పెద్దగోని శ్రీనివాస్, బబ్బురి శ్రీనివాస్, పోచంపల్లి కొండయ్య, తదితరులు పాల్గొన్నారు.