పేరుకు శాసన సభ్యులు..
చేసేవి శాసన ఉల్లంఘనలు..
సాక్షాత్తు కోదాడ శాసన సభ్యుడు తన అధికారిక వాహనంకు నంబర్ ప్లేట్ తీసేసి, సైరన్ సైతం ఏర్పాటు చేసుకొని ప్రయానిస్తున్న తీరు ఎమ్మెల్యేకు చట్టం పట్ల ఉన్న గౌరవాన్ని, నిబద్దతను తెలియజేస్తున్నదని సామాజిక ఉద్యమకారుడు కొల్లు వెంకటేశ్వరరావు విమర్శిoచారు.
అదే సామాన్యుడు వాహనంపై రోడ్ మీదకు వెళితే ఇంటికి తిరిగి వచ్చేసరికి పోలీస్ చలాన్ పడకుండా ఉండని ఈరోజుల్లో మరి పోలీస్ లకు ఎమ్మెళ్యే ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన కనపడక పోవడం విడ్డూరంగా ఉందని అన్నారు.
ప్రజలు అమాయకులు మనల్నెం పీకుతారులే అని భావిస్తున్న అమాత్యులు, అధికారులు అది నిజం కాదని సమయం వచ్చినప్పుడు కీలేరిగి వాత పెట్టడంలో ప్రజలు సిద్దహస్తులని గ్రహించి చట్టాన్ని గౌరవిస్తే అందరికీ మంచిదని చెప్పారు