పేలుళ్ల ఘటనతో ప్రభుత్వానికి చెడ్డపేడు : పొన్నం ప్రభాకర్
హైదరాబాద్: దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల ఘటన ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకువస్తుందని కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. బాంబు దాడులపై కేంద్రం ముందే హెచ్చరించినా…ఇక్కడి పోలీసులు తేలికగా తీసుకోవడం దేనికి సంకేతమని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో సొంత మంత్రులు, ఎంపీలపై ఇంటెలిజెన్స్ పనిచేస్తోంది కానీ.. ఉగ్రవాదుల కదలికలపై కాదని మండిపడ్డారు. సడక్ బంద్ సందర్భంగా బైండోవర్లు, ఎంపీల అరెస్టుల కన్నా.. ప్రభుత్వం ప్రజల భద్రతపై దృష్టి సారించాలని సూచించారు.