పోలీసులు, వేటగాళ్ల మధ్య కాల్పులు

చిత్తూరు: కేవీపల్లి మండలం మారెళ్ల అటవీప్రాంతంలో పోలీసులు, వేటగాళ్ల మధ్య కాల్పులు  చోటుచేసుకున్నాయి. ఆడవిలో వేటగాళ్లను గుర్తించిన పోలీసులు వారిని వెంబడించారు. దీంతో వేటగాళ్లు పోలీసులపై కాల్పులకు తెగబడ్డారు. ప్రతిగా పోలీసులు వారిపై నాలుడురౌండ్ల కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒక  వేటగాడిని పోలీసులు అదుపులోకి తీసుకోగా నలుగురు పరారీలో ఉన్నారు.