పోలీసుల అదుపులో మావోయిస్టు నేత
విశాఖ: మావోయిస్టు నేత సూర్యంను పోలిసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఒరిస్సాలోని మల్కాన్‌గిరి జిల్లాలో సూర్యంను పోలిసులు అదుపులోకి తీసుకొని రహస్య ప్రదేశానికి తరలించినట్లు తెలిసినప్పటకీ పోలీసులు మాత్రం ఈ విషయాన్ని ధృవీకరించడంలేదు. ఏవోబీలో మావోయిస్టు కార్యకలాపాల్లో సూర్యం కీలక పాత్ర పోషిస్తున్నారు.