పోలీసు అధికారులకు ఎసిబి సమన్లు

ఖమ్మం, జూలై 17 : మద్యం వ్యాపారి నున్నా రమణ ఇచ్చిన వాంగ్మూలం మేరకు ముడుపుల వ్యవహారంపై పోలీసు అధికారులకు సమన్లు అందించేందుకు ఎసిబి అధికారులు సిద్ధమయ్యారు. ఇటీవల వరంగల్‌ జిల్లా పోలీసు అధికారులకు సమన్లు అందించి విచారణ పూర్తి చేసిన ఎసిబి వర్గాలు ఖమ్మం జిల్లాపై దృష్టి పెట్టాయి. ఆరుగురు పోలీసు అధికారులు, మ్గురు పాత్రికేయులకు సమన్లు అందజేసి, వారి స్టేట్‌మెంట్లు రికార్డు చేయనున్నారు. రెండు మూడు రోజుల్లో పనిపూర్తి చేసేందుకుద ఎసిబి అధికారులు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.