పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం

 

దౌల్తాబాద్ మార్చి 24, జనం సాక్షి
అంగన్‌వాడీలే కేంద్రంగా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం సాధ్యం అవుతుందని మండల విద్యాధికారి నర్సవ్వ పేర్కొన్నారు. దౌల్తాబాద్,గాజులపల్లి అంగన్‌వాడీ కేంద్రాల్లో శుక్రవారం నిర్వహించిన పోషణ అభియాన్ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో తృణ ధాన్యాలు వాటి పోషక విలువల పై మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. పోషణ అభియాన్ గురించి అవగాహన కోసం ర్యాలీ నిర్వహించి విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం వ్యాసరచన పోటీలో మొదటి బహుమతి పొందిన స్వస్తిక, ద్వితీయ బహుమతి పొందిన సంతోష లకు బహుమతులు మండల విద్యాధికారి నర్సవ్వ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ శ్రీనివాస్, పిహెచ్ఎన్ గీత భవాని, ఏపీఎంవో సంతోష్ కుమార్, ఏఎన్ఎం కరుణ కుమారి, అంగన్వాడీ టీచర్లు సులోచన,రమాదేవి,గిరిజ, ప్రతిభ,రాధిక,సరోజ తదితరులున్నారు.