ప్రజలు మార్పు కోరుకుంటున్నారు:టీడీపీ

ఆదిలాబాద్‌, జూలై 5 : ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు తెలుగుదేశం చిత్తశుద్ధితో ఉందని ఆ పార్టీ ఆదిలాబాద్‌ ఎంపీ రమేష్‌రాథోడ్‌ పేర్కొన్నారు. త్వరలో తెలంగాణ విషయమై మరోసారి కేంద్రానికి లేఖను  అందించనున్నామని ఆయన తెలిపారు. కేంద్ర, రాష్ట్రాలలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ ప్రజా సంక్షేమాన్ని విస్మరించి అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. రోజురోజుకు పెరుగుతున్న ధరలతో  ప్రజలు విసిగిపోయారని దేశం, రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో  ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రజాప్రతినిధులు ఢిల్లీ పర్యటనలకు పరిమితమవుతున్నారే తప్ప రాష్ట్రం గురించి పట్టించుకోవడం లేదని ఆరోపించారు. భవిష్యత్‌ తెలుగుదేశం పార్టీదేనని పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.