ప్రజాపంథా నుండి న్యూడెమోక్రసీ ఐ ఎఫ్ టి యు లో 250 కుటుంబాలతొ చేరికా
ప్రజాపంథా నుండి న్యూడెమోక్రసీ ఐ ఎఫ్ టి యు లో 250 కుటుంబాలతొ చేరికా రఘునాథ పాలెం ఏప్రిల్ 01(జనం సాక్షి)ఖమ్మం జిల్లా కేంద్రంలో ప్రజాపందా అనుబంధ సంస్థ అఖిలభారత కార్మిక సంఘాల సమైక్య నుండి ఈరోజు తన మాతృ సంస్థ సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ అనుబంధ సంఘం ఐఎఫ్టీయూ నాయకులు జి పటేల్ .బి నాగేశ్వరరావు రమేష్ ఆద్వర్యంలో 250 కుటుంబాలు చేరారుబల్లే పల్లి లో నిర్వహించిన సభలో అఖిల భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు ఖమ్మం జిల్లా అధ్యక్షులు షేక్ సుబహాన్ జిల్లా అధ్యక్షతన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనార్ధన్ పాల్గొని కార్మికులను మెడలో కార్మిక జెండాతో వేసి సాధారణంగా సంఘంలోకి ఆహ్వానించారు.అనంతరం జరిగిన సభలో మాట్లాడుతూదేశంలో అఖిల భారత స్థాయిలో కార్మిక సంఘం పనిచేస్తూ నాటి నెల్లిమర్ల కార్మికుల ఉద్యమ స్ఫూర్తితో 1996లో ఏర్పడి నేటి వరకు కార్మికుల విభాగం పట్ల అనేక పోరాటాలు నిర్వహిస్తూ అనేక విజయాలు సాధిస్తూ పనిచేస్తుందని. అటువంటి సంస్థను ఇటీవల కాలంలో కొంతమంది కార్మిక సంఘం నుండి చీలి నడిపిస్తున్నారని,దానిలో సిద్ధాంతం లేదని, ఆచరణలో ఆ కార్మిక విభాగం లేదని ఆ కార్మిక విభాగంలో మేము పనిచేయలేమని కార్మికా వ్యతిరేకమైన తప్పుడు పద్ధతులను అవలంబిస్తున్నారని చెప్పి స్వచ్ఛందంగా ఖమ్మంలో తన మాతృ సంస్థ అయిన న్యూడెమోక్రసీ అనుబంధ సంఘమైన కార్మిక విభాగంలో చేరటం అభినందనియం అన్నారు.కేంద్ర గవర్నమెంట్ 49 చట్టాలను రద్దు చేస్తూ నాలుగు లేబర్ కోడ్ లను తీసుకొస్తూ కార్మికుల పట్ల కార్మిక వ్యతిరేక విధానాలను అమలు చేయడం కోసం కుటిల ప్రయత్నం చేస్తుందని తక్షణమే ఉపసంహరించుకోవాలని, దశల వారి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించామని, భవిష్యత్తులో నిర్వహిస్తామని ఈ సందర్భంగా వారు అన్నారుఅసంఘటిత కార్మిక రంగంలో పనిచేస్తూ ప్రమాదవశాస్తూ మరణిస్తే చనిపోయిన కుటుంబానికి 20 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని సాధారణ మరణం సంభవిస్తే పది లక్షల రూపాయలు అదేవిధంగా వివాహం మరియు గర్భిణీ స్త్రీలకు లక్ష రూపాయలు కేటాయించాలని లేబర్ కార్డు ఉండి 60 సంవత్సరాలు దాటిన వృద్ధాప్యం కలిగినటువంటి వారికి 6000 పెన్షన్ మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమములో భవన నిర్మాణ ఇతర కార్మిక సంఘాల సమైక్య రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు గంట నాగయ్య,గోపాల్ రావు అరుణోదయ రాష్ట్ర కార్యదర్శి అరుణోదయ నాగన్నసిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ ఖమ్మం జిల్లా కార్యదర్శి మందుల రాజేంద్రప్రసాద్ పౌర హక్కుల సంఘం రాష్ట్ర నాయకులు పొట్లపల్లి విప్లవ కుమార్అఖిలభారత రైతు కూలీ సంఘం ఎఐకెయంస్ జిల్లా అధ్యక్షులు బజ్జూరి వెంకట్రాంరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు షేక్ కాసీం, (ఐఎఫ్టియు)ఖమ్మం జిల్లా కార్యదర్శి ఐ వెంకన్న న్యూ డెమోక్రసీ ఖమ్మం డివిజన్ కార్యదర్శి కోలా లక్ష్మీనారాయణ మహిళా సంఘం పిఓడ్యు జిల్లా అధ్యక్షురాలు పరకాల లక్ష్మి తదితరులు పాల్గొన్నారు