ప్రజా సమస్యలు పరిష్కరించాలన్న చిత్తశుద్ధి కిరణ్ సర్కారుకు లేదరు: చంద్రబాబు
హైదరాబాద్: రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలను అందరి ఒత్తిడి మేరకు మొక్కుబడిగా అయిదు రోజులు నిర్వహిస్తున్నారని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు ఆరోపించారు. ప్రజా సమాస్యలు పరిష్కరించాలన్న చిత్తశుద్ధి కిరణ్ సర్కారుకు లేదని చేప్పారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కళంకిత మంత్రులతోపాటు విద్యుత్ కోతలు, నిరుద్యోగ సమస్య రైతుల ఇబ్బందులు, నీటి యుద్దాలులాంటి ఎన్నో ప్రధాన సమస్యలపై చర్చకు అయిదు రోజుల సమావేశాలు ఎలా సరిపోతాయని చంద్రబాబు ప్రశ్నించారు.