ప్రతిపక్షాలు మోసపూరితంగా వ్యవహరిస్తున్నాయి : బొత్స సత్యనారాయణ

హైదరాబాద్‌: రూ.26 వేల కోట్లతో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వం తమదని, సామాన్యులకు నష్టం కలిగేలా తమ ప్రభుత్వం ఎప్పుడూ వ్యవహరించదని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. ఆయన గాంధీభవన్‌లో మాట్లాడుతూ ప్రతిపక్షాలు మోసపూరితంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో 63 లక్షల యూనిట్ల విద్యుత్‌ కొరత ఉందని ఆయన తెలియజేశారు. బొత్స సత్యనారాయణ ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు.

తాజావార్తలు