ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించాలి

ఆదిలాబాద్‌, జూలై 13 : ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని ఐకాస నేతలు హెచ్చరించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఆదిలాబాద్‌లో చేపట్టిన రిలే దీక్షలు శుక్రవారంనాటికి 922వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా పని చేసే పార్టీలకు, నాయకులకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ప్రజలు చేస్తున్న ఉద్యమాన్ని, వారి ఆకాంక్షకు ఆనుగుణంగా కేంద్రం ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయకపోతే ఉద్యమం మరింత తీవ్రతరం అవుతుందని హెచ్చరించారు.