ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి

ఖమ్మం, జనవరి 19 (): నిర్మల్‌ భారత్‌ అభియాన్‌ పథకం ద్వారా జిల్లాలోని అన్ని మండలాల్లో వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించి రాష్ట్రంలోనే జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నామని జిల్లా పరిషత్‌ సిఇఓ దేవరాం తెలిపారు. జిల్లావ్యాప్తంగా 1.30 లక్షల మరుగుదొడ్ల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. జిల్లాలోని అన్ని మండలాల్లో అవాస ప్రాంతాల వారీగా అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సిబ్బందికి మరుగుదొడ్ల నిర్మాణం లక్ష్యాలను నిర్దేశిస్తున్నామన్నారు. జిల్లాలో ఇప్పటివరుకు సుమారు 10 వేల మరుగుదొడ్లు పూర్తయ్యాయన్నారు. ఈ నెలాఖరులోపు మరికొన్ని త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. మరుగుదొడ్ల నిర్మాణం లబ్ధిదారులకు ఇసుక కొరత, ధర విషయమై జిల్లా కలెక్టర్‌ సిద్ధార్థజైన్‌ దృష్టికి తీసుకెళ్తామని ఆయన అన్నారు.