ప్రధాని అభ్యర్థిగా మోడీని ప్రకటించండి: రాం జెఠ్మలానీ

న్యూఢిల్లీ: 2014లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో భాజపా తరపున గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలని ప్రముఖ న్యాయవాది, భాజపా ఎంపీ కోరారు. మోడీకీ మద్దతు పలుకుతూ ఆయన భాజపా జాతీయ అధ్యక్షుడు గడ్కరీకి లేఖ రాశారు. కొందరి విషప్రచారం వల్లనే మోడీని మైనార్టీల వ్యతిరేకిగా చిత్రీకరిస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.