ప్రధాని ప్రసంగాన్ని తప్పుబట్టిన మమతా

కోల్‌కతా: సంస్కరణలు, డీజిల్‌ ధరల పెంపుపై ప్రధాని మన్మోహస్‌సింగ్‌ చేసిన ప్రసంగాన్ని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతాబెనర్జీ తప్పుబట్టారు, ఆమ్‌ఆద్మీ కోసం  శ్రమిస్తున్నట్లుగా  ప్రధాని చేసిన ప్రకటనను ఆమె ఖండించారు, ఆమ్‌ఆద్మీ కోసం శ్రమిస్తున్నట్టుగా ప్రధాని చేసిన ప్రకటనను ఆమె ఖండించారు. ఆమ్‌ ఆద్మీ అంటే ఎవరు? ప్రజాస్వామ్యానికి నిర్వచనం ఏమిటని ఆమె ప్రశ్నించారు. ప్రధాని పీఠంలో ఉండి సామాన్యుడిపై భారం మోపుతున్న వైఖరిని ఆమె తప్పుబట్టారు.