ప్రపంచ పెద్దపోలీస్‌.. పాక్‌లో వైమానిక దాడులు

18 మంది మిలిటెంట్ల కాల్చివేత
ఇస్లామాబాద్‌, ఆగస్టు 24 (జనంసాక్షి) :పాకిస్థాన్‌లో ఉగ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో అమెరికా మరోసారి వైమానిక దాడులు చేసింది. శుక్రవారం ఉత్తర వజీరస్థాన్‌ గిరిజన ప్రాంతంలో జరిపిన దాడుల్లో 18 మంది ఉగ్రవాదులు మరణించారు. ఈ మేరకు పాకిస్థాన్‌ రేడియో వెల్లడించింది. తాజా దాడుల్లో మృతిచెందిన వారి సంఖ్య పెరిగే అవకాశముందని పేర్కొంది. మరోవపు గత కొన్ని వారాలుగా అమెరికా వైవమానిక దాడులు చేస్తుండటంపై పాకిస్థాన్‌ ప్రభుత్వం మండిపడుతోంది. దేశ సార్వభౌమత్వానికి విఘాతం కలిగిస్తూ అమెరికా దాడాలు చేస్తోందని విదేశీ వ్వవహారాల శాఖ ధ్వజమెత్తింది. ఈ విషయంలో రెండు రోజుల కిందటే అమెరికా దౌత్యాధికారుల ముందు నిరసన వ్యక్తం చేసింది. అయినా అమెరికా మరోసారి దాడులు చేయడం విశేషం.