ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పింది : కోదండరాం
హైదరాబాద్ : తెలంగాణ కవాతు నిర్వహణ కోసం ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పిందని తెలంగాణ ఐకాస చైర్మన్ కోదండరాం అన్నారు. కవాతుకు వస్తున్న నేతలను అరెస్టు చేయడంపె మండిపడ్డారు. తెలంగాణ వాదులంతా సంయమనం పాటించాలని కోరారు. కవాతువేదిక వద్ద సమావేశమై అన్ని విషయాలు చర్చిస్తామని చెప్పారు. ప్రాంగణం నుంచే భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని,వెల్లడించారు.