ప్రభుత్వం మాట తప్పింది: నారాయణ

హైదరాబాద్‌: తెలంగాణ మార్చ్‌కకు అనుమతినిచ్చిన రాష్ట్ర ప్రభుత్వం మాట తప్పిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ విమర్శించారు. ఉద్యమకారుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఆయన తప్పుబట్టారు. కవాతు సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయనన్నారు.