ప్రభుత్వ అసమర్థత వల్లే గ్యాస్‌ తరలింపు: నాగేశ్వరరావు

ఢిల్లీ :ప్రభుత్వ అసమర్థత వల్లే రత్నగిరికి గ్యాస్‌ తరలిపోతోందని ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన జైపాల్‌ రెడ్డి రాష్ట్రానికి ఏ విధమైన న్యాయం చేయలేదని, రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని కప్పిపుచ్చడానికే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. రత్నగిరి గ్యాస్‌ కేటాయింపులన్నీ రాష్ట్ర ప్రజాప్రతినిధులందరికీ తెలిసి జరిగినవేనని, అందుకు  రాష్ట్ర ఎంపీలందరూ బాధ్యత వహించాలని ఆయన అన్నారు. విద్యుత్‌ కోతతో ప్రజలు అల్లాడుతోంటే కనీసం పట్టించుకున్న దాఖలలే లేవని ఆయన విమర్శించారు. రాష్ట్రానికి నష్టం జరుగుతున్నా  మంత్రి జైపాల్‌ రెడ్డి పట్టించుకోవడం లేదన్నారు.