ప్రభుత్వ సంక్షేమ పథకాలలో మేరు కులస్థులకు తగిన ప్రాధాన్యత కల్పించాలి.
కోటగిరి ఫిబ్రవరి 28 జనం సాక్షి:-ప్రభుత్వ సంక్షేమ పథకాలలో మేరు కులస్థులకు జీవన భృతి,జీవనో పాధి కల్పించడంలో తగిన ప్రాధాన్యత కల్పించాలనీ ఉమ్మడి కొటగిరి మండల మేరు సంఘం సభ్యులు పేర్కొన్నారు.మంగళవారం రోజున టైలర్స్ డే పురస్క రించుకొని మండల మేరు సంఘం ఆధ్వర్యంలో మం డల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఇంటర్నేషనల్ టైలర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మేరు కులస్తుల సంక్షేమం కోసం ప్రభుత్వ పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎ మ్మార్వో కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మేరు కులస్థులు మాట్లాడుతూ.. ఉమ్మడి కోటగిరి మండలంలో సుమారు 100 మంది మేరు కుటుంబాలు టైలర్ వృత్తిపై ఆధారపడి జీవిస్తు న్నమన్నారు.ఇప్పటివరకు మేరు కుటుంబాలు టైలర్ వృత్తి పై ఆధారపడి నేటి రెడీమేడ్ వ్యవస్థకు దీటుగా జీవనం సాగిస్తున్నామన్నారు.కానీ మేరు కులస్తులకు ప్రభుత్వం ఎలాంటి పథకాలు అమలు కావడం లేదన్నారు.ఇకనైనా ప్రభుత్వం నాయిని బ్రాహ్మణ, రజక కులస్థులకు అమలుపరుస్తున్నా ఉచిత కరెంటు విధానాన్ని మేరు కురస్థులకు కూడా కల్పించి,టైలర్ వృత్తిని నమ్ముకున్న వారికి రెండు లక్షల రూపాయల రుణ సదుపాయం కల్పించాలన్నారు.అదేవిధంగా టైలర్ వృత్తిదారులకు 2000 రూపాయల జీవన భృతిని అమలుపరిచేలా ప్రభుత్వం చర్యలు చేపట్టా లన్నారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి కోటగిరి మండల మేరుకుల సంఘం అధ్యక్షులు గట్ల రవీందర్,ప్రధాన కార్యదర్శి రవికుమార్,ఉపాధ్యక్షులు షాజీ,కోశాధికా రి వై రాజు,సభ్యులు గంగాధర్, కృష్ణ,చరణ్,సందీప్,నవీన్ తదితరులు పాల్గొన్నారు.