ప్రస్తుత విద్యాసంవత్సరంలో 100 కళాశాలలు ఏర్పాటుచేస్తాం : సిబాల్
న్యూఢిల్లీ: వృత్తివిద్య శిక్షణను బోధించేందుకు ప్రస్తుత విద్యాసంవత్సరంలో 100 కళాశాలలు ఏర్పాటుచేసేందుకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి కపిల్‌సిబాల్ అంగీకరించారు. ఈ 100 సామాజిక కళాశాలల్లో కెనడా పది కళాశాలల ఏర్పాటుకు సహకరిస్తుంది అని గురువారమిక్కడ విశ్వ నైపుణ్య సదసుల్లో సిబాల్ చెప్పారు. కెనడాలోని 130 కాళాశాలల తరపున ఏసీసీసీ అధ్యక్షుడు, ముఖ్య కార్యనిర్వహణాధికారి జేమ్స్ నైట్ ఒప్పందంపై సంతకం చేశారు. ఈ కార్యక్రమంలో సిబాల్ మాట్లాడుతూ హర్యానాలో సుమారు 40 పాఠశాలల్లో ప్రభుత్వం వృత్తివిద్య కార్యక్రమం ప్రారంభించిందని, రానున్న నెలల్లో దేశవ్యాప్తంగా ప్రారంభిస్తుందని వివరించారు.