ప్రైవేటు పాఠశాలలకు అండగా తెదేపా : బాబు

కరీంనగర్‌: ప్రైవేటు పాఠశాలల సమస్యలపై పోరాటానికి తెదేపా అండగా ఉంటుందని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. వస్తున్నా మాకోసం పాదయాత్రలో భాగంగా ఆయన కరీంనగర్‌ జిల్లా సుల్తానాబాద్‌ మండలం నరసయ్యపల్లిలో ప్రైవేటు పాఠశాలల  యజమానులతో ముఖాముఖీ మాట్లాడారు. ఢిల్లీ ఘటనపై ప్రధాని మూడ్రోజుల తర్వాత స్పందించటం విచారకరమని ఆయన వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్న  కాంగ్రెస్‌ తెలంగాణపై మాట్లాడకుండా తెదేపాను ఇరుకున పెట్టే యత్నం చేస్తోంది. వీసా అన్న వైఎస్‌ వ్యాఖ్యాల కారణంగా సీమాంధ్రలో తమకు ఓట్లు తగ్గాయని అభిప్రాయపడ్డారు.