ప్రైవేటు బస్సులపై ఆర్టీఏ దాడులు, 66 బస్సులు సీజ్
రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు వాహనాలపై రవాణాశాఖ అధికారులు దాడులు నిర్వహించారు. హైదరాబాద్ నగర శివారుతో పాటు పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించి రహదారులపై తిరుగుతున్న 55 ప్రైవేట్ ట్రావెల్స్ పై కేసులు నమోదు చేసి సీజ్ చేశారు. శంషాబాద్ వద్ద 40, మదీనాగూడ వద్ద 15 బస్సులను సీజ్చేశారు. మెదక్-సదాశివపేట రహదారిలో చేపట్టిన తనిఖీల్లో 11 బస్సులను సీజ్ చేశారు.