ఫలక్‌నుమా వద్ద కాల్పుల ఘటనలో నిందితుల అరెస్టు

బీబీకాచష్మా వద్ద మహ్మద్‌ మాన్సూర్‌పై కాల్పులు జరిపిన ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. తబస్తీలో ఈనెల 21న జరిగిన కాల్పుల ఘటనను దక్షిణ మండల పోలీసులు చేదించారు. పాతకక్షల కారణంగానే మాన్సూర్‌పై కాల్పులు జరిగినట్లు నగర పోలీసు కమిషనర్‌ అనురాగ్‌ శర్మ వెల్లడించారు. నిందితుల నుంచి రెండు తుపాకులు, 5బుల్లెట్లు, డాగర్‌, 6సెల్‌పోన్లు, రెండు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ మాన్సూర్‌ ప్రస్తుతం నిమ్స్‌లో చికిత్స పొందుతున్నాడు.