ఫిర్యాదుల పెట్టెను సద్వినియోగం చేసుకోండి

జగిత్యాల, జూన్‌ 11 (జనంసాక్షి):

పట్టణ ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ఫిర్యాదుల పెట్టెను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జగిత్యాల ఆర్డీవో మున్సిపల్‌ ప్రత్యేకాధి కారి యం. హనుమంతరావు అన్నారు. బల్దీయా కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫిర్యాదు పెట్టెను సోమవారం ఆయన తెరచి అందులోని 3 అర్జీలను  పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ అక్రమంగా కట్టడాలు నిర్మిస్తున్న వాటిఫిర్యా దులను, పట్టణంలో నల్లా రాకున్నా , డ్రైనేజీ శుభ్రంలేకున్నా, వీదిదీపాలు వెలుగకున్నా, వార్డులలో రోడ్లు సరిగా లేకపోయినా , గతంలో వేసిన రోడ్లు చెడిపోయినా వాటివివరాలను ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ఫిర్యాదుల పెట్టెద్వారా తనకు తెలియజేయాలని ప్రజలను కోరారు.  ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ డీ ఈ వెంకటేశ్వర్‌లు, టీపీఓమధుసూదన్‌, సానిటరీ ఇన్స్‌పెక్టర్‌లు మహేశ్వర్‌ రెడ్డి, విజయ్‌కుమార్‌  మున్సిపల్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.