బదిలీపై వెళ్తున్న ఎస్సై జీవన్ రాజుని ఘనంగా సన్మానించిన: జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత.
బూర్గంపహాడ్ ఆగష్ఠ్ 25 (జనంసాక్షి)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలం సారపాక ఐటిసి గెస్ట్ హౌస్ లో ఎస్సై జీవన్ రాజు బదిలీపై వెళ్తున్న సందర్భంగా జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత, టిఆర్ఎస్ పార్టీ నాయకులు వారిని శాలువాలతో ఘనంగా సన్మానించి, జ్ఞాపికను, పుష్పగుచ్చెం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సై జీవన్ రాజు మండలానికి ఎన్నో విశిష్ట సేవలందించారన్నారు. మండల ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉంటూ తనదైన శైలిలో ప్రజలకు సేవలందించి పోలీసులు అంటే ప్రజలకు భయపడాల్సిన అవసరం లేదని, ప్రజలతో కలిసి వారికి సేవలు అందించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గోపిరెడ్డి రమణారెడ్డి, సొసైటీ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్, సారపాక టౌన్ పార్టీ ప్రెసిడెంట్ కొనకంచి శ్రీను, పార్టీ టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ బాలి శ్రీహరి, పార్టీ టౌన్ ప్రధాన కార్యదర్శి తిరుపతి ఏసోబు, పినపాక నియోజకవర్గం టిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చల్లకోటి పూర్ణచంద్రరావు, సారపాక టౌన్ యూత్ పార్టీ ప్రెసిడెంట్ సోము చైతన్య రెడ్డి, పార్టీ నాయకులు బిట్రు సాయిబాబా, బెజ్జంకి కనకాచారి, భూక్య శీను, గాంధీ నగర్ మణి, తుమ్మల కిరణ్, తదితరులు పాల్గొన్నారు.