బహిరంగ ప్రదేశాలలో మత్తుపదార్థాలు నిషేధం
ఎస్ఐ తాజుద్దీన్
వెంకటాపూర్ (రామప్ప)జనం సాక్షి ; యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం ప్రదేశాలలో తో పాటు మండల వ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం ధూమపానం సేవించడం నిషేధమని ఎస్సై తాజుద్దీన్ అన్నారు ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన తరువాత విలేకర్లతో ముచ్చటించారు యువత చెడు అలవాట్లకు బానిసలు కాకుండా చదువుకొని ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకుని మంచి మార్గాన పయనించాలన్నారు ఎటువంటి సమస్యనైనా తనను నేరుగా సంప్రదిస్తే సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు గ్రామాల్లోని ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేస్తానని తెలిపారు సంఘ విద్రోహుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు ఎవరైనా నిషేధాజ్ఞలు ఉల్లంఘించినట్లయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు