బాధితురాలిని కలిసిన అస్సాం ముఖ్యమంత్రి

గౌహతి: ఇటీవల ముష్కరమూకల దాడికి గురైన మైనర్‌ బాలికను అస్సాం ముఖ్యమంత్రి తరుణ్‌ గొగోయ్‌ ఈరోజు కలిశారు. సంఘటన జరిగి వారం రోజులవుతున్నా పోలీసులు నిందితులందరినీ అరెస్టు చేయకపోవడం పట్ల జాతీయ మహిళా కమిషన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తోంది. ఆమెకు భద్రత కల్పిస్తానని, ఆర్థిక సాయం అందజేస్తానని ఆయన హమీ ఇచ్చారు.