బాధ్యతలు చేపట్టిన టేకులపల్లి ఎస్సై రమణారెడ్డికి అభినందనలు

టేకులపల్లి, ఫిబ్రవరి 14( జనం సాక్షి ): నూతనంగా టేకులపల్లి సబ్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన జి. రమణారెడ్డిని మర్యాదపూర్వకంగా కలసి శాలువతో సన్మానించి అభినందనలు టేకులపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ బోడ సరిత తెలిపారు. సోమవారం టేకులపల్లి సబ్ ఇన్స్పెక్టర్ గా రమణారెడ్డి బాధ్యతలు చేపట్టారు. స్థానిక గ్రామపంచాయతీ సర్పంచ్ సరితతో పాటు పి. వై. యల్ కొత్తగూడెం డివిజన్ కార్యదర్శి టేకులపల్లి గ్రామ పంచాయతీ 1వ వార్డు సభ్యులు నోముల భానుచందర్, మండల కొప్షన్ సభ్యులు మహ్మద్ మౌలాన , టి ఆర్ యస్ మాజీ మండల అధ్యక్షులు తేజ వత్తు రవి, రెండో వార్డు సభ్యులు జి. బాబు, సేవా లాల్ సేన జిల్లా నాయకులు, ధారావతు సురేష్, మండల నాయకులు నాగరాజు, మాజీ జిల్లా నాయకులు వస్రం తదితరులు అభినందనలు తెలిపిన వారిలో ఉన్నారు.