బాబ్లీ సమస్య పరిష్కారానికి సీఎం చోరవ చూపాలి తెదేపా

హైదరాబాద్‌: మహరాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి బాబ్లి సమస్య పరిష్కారానికి చోరవ చూపాలని సీఎం కిరణ్‌ కుమార్‌రెడ్డికి  ఐదు జీల్లాల తెదేపా ప్రతినిదులు వినతి పత్రం అందజేశారు. తెలంగాణ అంశంపై ఈ నెలలోనే చంద్రబాబు కేంద్రానికి లేఖరాస్తారని అపార్టీనేత ఎర్రబెల్లి దయాకర్‌రావు ఈ సందర్భంగా స్పష్టం చేశారు బాబ్లీ ప్రాజెక్టు వల్ల తెలంగాణలోని నల్గోండ, కరీంనగర్‌,నిజామాబాద్‌, అదిలాబాద్‌, ఖమ్మం జీల్లాలు ఎడారిగా మారే పరిస్థితి ఏర్పడిందని వారు అవేదన వ్యక్తం చేశారుబాబ్లీ ప్రాజేక్టుపై న్యాయవాదులు సుప్రీంకోర్టులో సరైన  రీతిలో వాదించకపోవడంవల్లే తీర్పు అలస్యమైందని తెదేపా నేతలు అభిప్రాయపడ్డారు. కేంద్రం, మన రాష్ట్రం,మహరాష్ట్రలోనూ కాంగ్రెస్‌ ప్రభుత్వమే ఉన్నందున ముఖ్యమంత్రులు కూర్చుని మాట్లాడుకుంటే సమస్య పరిష్కారమవుతుందని వారు సూచించచారు.