బాలుని ఆచూకీ లభ్యం

తిరుమల: శ్రీవారి క్షేత్రంలో నిన్న అదృశ్యమైన బాలుని ఆచూకీ లభించింది. నిన్న సాయంత్రం తల్లిదండ్రుల వద్ద నిద్రిస్తున్న సమయంలో బాలున్ని ఇద్దరు మహిళలు ఎత్తుకెళ్లినట్లు పోలీసులు సీసీ టీవీ దృశ్యాల ద్వారా గుర్తించారు. అనంతరం గాలింపు చేపట్టి మహిళలను పట్టుకొని బాలుడిని తల్లిదండ్రులకు పోలీసులకు అప్పగించారు.