‘బిల్డ్‌ ఫర్‌ ఇండియా-2012’ ప్రదర్శన ప్రారంభం

హైదరాబాద్‌:ప్రభుత్వ పారిశ్రమిక విధానం అమలు వల్లే మౌలిక వసతులు, నిర్మాణ రంగం అభివృద్ధి సాధ్యమవుతుందని బిల్డర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా జాతీయ అధ్యక్షుడు శీనయ్య అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లో నిర్మాణ రంగం వృద్ధికి చాలా అవకాశాలున్నాయని ఆయన చెప్పారు. హైదరాబాద్‌లో హైటెక్స్‌లో నాలుగు రోజుల పాటు జరిగే 3వ జాతీయ స్థాయి బిల్డ్‌ ఫర్‌ ఇండియా 2012 ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. దీంట్లో నిర్మాణ రంగంలో ఉన్న అపరిమిత.నిర్మాణ రంగంలో వస్తున్న అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, విభిన్న పద్దతులు, వినూత్నమైన ఉత్పత్తులకు సంబంధించిన సమాచారాన్ని ఈ ప్రదర్శనలో అందుబాటులోకి తెచ్చారు. అంతర్జాతీయంగా ప్రఖ్యాతి గాంచిన పలు బహుళ జాతి సంస్థ ప్రదర్శనలో పాల్గొంటున్నారు.