బీసీలకు టీడీపీ 100సీట్లు ఇస్తామంటే ఎవరు నమ్మటంలేదు:టీఆర్‌ఎస్‌

కరీంనగర్‌: తెలుగుదేశం పార్టీ బీసీలకు వంద సీట్లు ఇస్తామంటే ఎవరు నమ్మటం లేదని సిరిసిల్ల టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే తారకరామారావు అన్నారు. చంద్రబాబుకు మాట మార్చటం మాట తప్పటం అలవాటేనని అన్నారు. టీఆర్‌ఎస్‌ రెండువేల తోమ్మిది ఎన్నికల్లో చాలామంది బీసీలకు టికెట్లిచ్చిందని అన్నారు. చంద్రబాబు లాగా మాట మార్చటం టీఆర్‌ఎస్‌కు తెలియదని అన్నారు.