బీసీ కార్పొరేషన్ ద్వారా రూ. 12.1 కోట్లు విడుదల
ఖమ్మం, జూలై 30 : ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బీసీ కార్పొరేషన్ ద్వారా రూ.12.1కోట్ల విలువైన 130 యూనిట్లను మంజూరు చేయాలని నిర్దేశిస్తూ నిధులు విడుదల చేసినట్టు కలెక్టర్ సిద్ధార్థ జైన్ తెలిపారు. పది శాతం, 40 శాతం బ్యాంకు రుణం, 50 శాతం ప్రభుత్వ రాయితీతో ఇస్తూ యూనిట్లు మంజూరు చేయనున్నట్టు తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో 27.7 లక్షల రూపాయలతో 84 యూనిట్లను గ్రౌండింగ్ చేసినట్టు తెలిపారు.