బూరుగడ్డ గ్రామ నివాసికి నాటక వైభవ రత్న అవార్డ్ ప్రధానోత్సవం

 

 

 

 

హుజూర్ నగర్ మార్చి (జనం సాక్షి): హుజూర్ నగర్ మండలం బూరుగడ్డ గ్రామ నివాసి తెలంగాణ రంగస్థల పౌరాణిక, జానపద కళాకారుడు యరగాని రామస్వామి గౌడ్ కి నాటక వైభవ రత్న అవార్డ్ ప్రధానోత్సవం చేశారు. సర్ సివి రామన్ అకాడమీ సేవ సాంస్కృతిక సంస్థ రుద్రాక్ష వైభవం ఆధ్యాత్మిక పీఠం ఆధ్వర్యంలో ఉగాది మహోత్సవ సువర్ణ కంకణ అవార్డును, హైదరాబాదులోని హర హర కళాభవన్ సికింద్రాబాద్ లో రుద్రాక్ష వైభవం సువర్ణ కంకణా అవార్డ్ ను నాటక వైభవ రత్న అవార్డును ప్రముఖ సినీ నటుడు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత తల్వార్ సుమన్ చేతుల మీదుగా యరగాని రామస్వామి గౌడ్ కి అవార్డును ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు లయన్ విజయ్ కుమార్, బ్రహ్మశ్రీ డా” శ్రీకృష్ణ చాముండేశ్వరి మహర్షి, ఎస్పీఎఫ్ కమాండెంట్ డాక్టర్ కె ఎన్ రావు, అసెంబ్లీ సెంట్రల్ జోన్ ఏసీపీ శ్రీ రాందాస్ తేజవత్, విశ్రాంతి న్యాయమూర్తి బూర్గుల మధుసూదన్, ఉత్తమ టెలివిజన్ సినీ నటులు శ్రీ విస్సం రాజు, సాయి, కిరణ్, మధు, వారణాసి, కోమటిరెడ్డి, గోపాల్ రెడ్డి, ప్రముఖ జ్యోతిష్య పండితులు శ్రీశ్రీశ్రీ నిత్య నిర్మాలనంద యత్ర యోగేశ్వర స్వామి సిద్ధాంతి, చెన్నై గౌడ్ సంఘం అద్యక్షులు గండి సృజన్ గౌడ్, యరగాని వెంకటేశ్వర్లు, సుమన్ అభిమాన సంఘం తెలంగాణ రాష్ట్ర అద్యక్షులు యరగాని కిరణ్ గౌడ్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.