ఎన్నికల ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరింపు: డీజీపీ

హైదరాబాద్‌, జూన్‌ 11: ఉప ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేశామని డీజీపీనీ దినేశ్‌రెడ్డి తెలిపారు. ఎన్నికలు జరిగే ప్రాంతాలకు భారీగా పోలీసులను మోహరించామన్నారు. మొత్తం మూడు వేల పోలింగ్‌ కేంద్రాలను సమస్యాత్మక, 93 నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించామన్నారు. 56 ఏపీపీఎస్సీ కంపెనీలు, మూడు వేల మంది కానిస్టేబుల్స్‌, 1500 మంది హోంగార్డులు, 2వేల మంది ఇన్‌స్పెక్టర్లు ఎన్నికల బందోబస్తు విధులు నిర్వహిస్తారన్నారు. 270 చెక్‌పోస్టులు, అలాగే 100కంపెనీలు ప్రత్యేక బలగాలు ఏర్పాటు చేశామని డీజీపీ  వివరించారు. కౌంటింగ్‌ తరువాత దాడులు జరుగుతాయన్న సమాచారంతో అప్రమత్తంగా ఉన్నామన్నారు. 135మందిపై కేసు నమోదు చేశామని ఇప్పటి వరకు రూ.30కోట్ల నగదును సీజ్‌ చేశామని డీజీపీ దినేష్‌రెడ్డి తెలిపారు.