బెటాలియన్‌ సమస్యల పరిష్కారానికి కృషి: హోంమంత్రి

హైదరాబాద్‌: ఏపీఎస్పీ బెటాలియన్‌ ఎదుర్కోంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని హోంమంత్రి సబిత తెలియజేశారు. దీని కోసం సోమవారం డీజీపీతో ఆమె సమావేశం కానున్నారు. మరోవైపు అన్ని బెటాలియన్లలో తలెత్తిన ఆందోళనలను శాంతింప జేయడానికి ఉన్నతాధికారులు ప్రయత్పాలు మెదలు పెట్టారు. 5,8 బెటాలియన్లలో వద్ద ధర్నా చేస్తున్న మహిళలతో ఆయన చర్చలు జరిపారు. విజయనగరం 5వ బెటాలియన్‌ కుటుంబీకుతో చర్చలకు అధికారులు వారిని పిలిచారు. సీఐ నాగేశ్వరరావు బహిరంగ క్షమాపణలకు వారు పట్టుబట్టారు.