బెల్లంపల్లి,  గురుకుల సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి.

– ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 3 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు.
– హాజరుకానున్న 1208మమది విద్యార్ధులు.
– హాల్ టికెట్ లో సూచించిన సూచనలను తూచా తప్పక పాటించాలన్న అధికారులు.

ఫిబ్రవరి 25, (జనంసాక్షి )తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే గురుకుల సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష  నేడు జరగనున్నది. ఉమ్మడి ఆదిలాబాద్ లో మూడు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్ష సమయం ఉదయం 10గం.ల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు కొనసాగనున్నది. పరీక్ష కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు  ఆదిలాబాద్ రీజియన్ సంక్షేమ గురుకులాల ఆర్ సి ఓ కొప్పుల స్వరూప రాణి తెలిపారు. శనివారం బెల్లంపల్లి సిఓఈ ప్రిన్సిపాల్ ఐనాల సైదులు తో కలిసి ఈ ప్రవేశ పరీక్షకు సంబందించిన పలు వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 6వ తరగతిలో ప్రవేశాల కోసం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 618 ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశానికి 590 మంది పరీక్ష రాయనున్నట్లు ఆమె తెలిపారు కొమరం భీమ్ ఆదిలాబాద్ జిల్లాలకు సంబంధించిన విద్యార్థులు ఆదిలాబాద్ బాలికల సిఓఈ పరీక్షా కేంద్రం కేటాయించినట్లు ఆమె తెలిపారు. విద్యార్థులు సంస్థ వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. హాల్ టికెట్ లో పొందుపరిచిన సూచనలను విద్యార్థులు తప్పక పాటించాలని ఆమె అన్నారు.ఆదిలాబాద్ లో (సిఓఈ బాలికలు) కేంద్రంలో 6వ తరగతిలో 200 మంది,ఇంటర్ మొదటి సంవత్సరంలో 199 మంది పరీక్షలకు హాజరు కానున్నరన్నారు.బెల్లంపల్లి(సిఓఈ బాలుర) కేంద్రంలో 6వ తరగతిలో 201 మంది,ఇంటర్ మొదటి సంవత్సరంలో 247 మంది విద్యార్థి పరీక్షలకు హాజరువుతారని వివరించారు.

నిర్మల్ (జామ్ బాలికలు) కేంద్రంలో
6వ తరగతిలో 217 మంది ఇంటర్ మొదటి సంవత్సరంలో 144 మంది విద్యార్థులకు పరీక్షల కోసం అన్ని వసతులు కల్పించమన్నారు.
బెల్లంపల్లి, ఆదిలాబాద్ పరీక్షా కేంద్రాలలో ఆయా చీఫ్ సూపరింటెండెంట్స్ ఐనాల సైదులు, సంగనబట్ల శ్రీనివాస్ లు వ్యవహరిస్తున్నట్లు ఆర్సీఓ తెలిపారు. పరీక్షకు సంబందించి ఏమైనా సందేహాలు ఉంటే విద్యార్ధి హాల్ టికెట్ లో ఇచ్చిన పరీక్షా కేంద్రం మొబైల్ నంబర్ కు ఫోన్ చేసి తెలుసుకోవాలని ఆమె సూచించారు.