బెల్లంపల్లి సిఓఈ విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు.

– ప్రిన్సిపాల్ సైదులు.
బెల్లంపల్లి, సెప్టెంబర్29,(జనంసాక్షి)
బెల్లంపల్లి పట్టణంలోని సిఓఈ విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు మంజూరైనట్లు ప్రిన్సిపాల్ ఐనాల సైదులు తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ
గత విద్యా సంవత్సరంలో జాతీయస్థాయి ప్రవేశ పరీక్షల్లో ప్రతిభ చూపి సీట్లు సాధించిన బెల్లంపల్లి సిఓఈ విద్యార్థులు 9 మందికి 3 లక్షల 30 వేల రూపాయలను తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ నగదు ప్రోత్సాహకంగా విద్యార్థులకు అందించినట్లు వివరించారు. ప్రోత్సాహకాలు అందుకున్న వారిలో
1) నైతం రాజేష్ కు రూ.50 వేలు
2) దుర్గం రంజిత్ కు రూ.40 వేలు
3) నందన్ కారి సాయితేజ కు రూ. 40 వేలు.
4) డోలే మల్లికార్జున్ కు రూ. 40 వేలు
5) చునార్కర్ ప్రవీణ్ కురూ.40 వేలు.
6)ముత్యంగారి అజయ్ కు రూ.40 వేలు.
7) కొత్తపల్లి నిఖిల్ కు రూ.30 వేలు.
8) ఓరుగంటి తన్మై కు రూ.25 వేలు.
9) మంచాల పవన్ కుమార్ కు రూ. 25 వేల రూపాయలు.
మొత్తం. 3లక్షల 30వేల రూపాయలు గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి డి రోనాల్డ్ రాస్ ఐఏఎస్ విడుదల చేసినట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. విద్యార్థులు పట్టుదలతో చదివి ఇలాంటి ప్రోత్సాహకాలు మరిన్ని అందుకోవడానికి ఆయన విద్యార్థులకు సూచించారు.