బేబీ కేర్ సెంటర్ల లైసెన్సింగ్‌పై..
హైదరాబాద్, జూలై 11 : బేబీకేర్ సెంటర్లకు లైసెన్సింగ్ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు యత్నిస్తున్నామని మంత్రి సునీతా లక్ష్మారెడ్డి చెప్పారు. బుధవారంనాడు ఆమె విలేకరులతో మాట్లాడుతూ బేబీ కేర్ సెంటర్లకు లైసెన్సింగ్ విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్టు చెప్పారు. లైసెన్సింగ్ విధానం ప్రవేశపెట్టాలా.. ప్రత్యేక పాలసీ రూపొందించి వాటి పరిధిలోకి బేబీ కేర్ సెంటర్ల నిర్వహణను చేర్చాలా అన్న దానిపై కసరత్తు ప్రారంభమైందన్నారు. ఈ విషయాలపై చర్చించేందుకు తొమ్మిది మంది సభ్యులతో కూడిన ఒక కమిటీని నియమించామని, ఈ కమిటీ అన్ని విషయాలపై చర్చించి ఒక నివేదికను రూపొందించి ప్రభుత్వానికి అందజేస్తుందన్నారు. ప్రభుత్వానికి అందజేశాక దాన్ని పరిశీలించి బేబీ కేర్ సెంటర్ల నిర్వహణపై తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.