బొత్సపై మండిపడ్డ తెలంగాణ నేతలు

హైదరాబాద్‌ : గాంధీ భవన్‌లో గణతంత్ర దినోత్సవం సందర్భంగా పీసీసీ అధినేత బొత్స సత్యనారాయణపై తెలంగాణవాదులు మండిపడ్డారు. రాజమండ్రి సభకు బొత్స హాజరవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రాంత ప్రజల మనోభావాలను అవమానపరిచారని ఆరోపించారు. పీసీసీ అధ్యక్షుడి హోదాలో రాజమండ్రి సభకు ఎలా వెళ్తారని ఉపాధ్యక్షుడు ఇంద్రసేనరెడ్డి ప్రశ్నించి బొత్సతో వాగ్వాదానికి దిగారు. ప్రసంగాన్ని అడ్డుకోవడానికి యత్నించడంతో దానం, పొంగులేటి వారించారు. మరో నేత, పార్టీ ప్రధాన కార్యదర్శి నిరంజన్‌ బొత్సకు కండువా  కప్పి జైతెలంగాణ నినాదాలు చేశారు. సోనియా, రాహుల్‌ స్ఫూర్తితో పార్టీని బలోపేతం చేద్దామని ఈ సందర్భంగా బొత్స పార్టీ నేతలకు పిలుపునిచ్చారు.