బొత్స వ్యాఖ్యలు యాధృచ్ఛికమే: పాలడుగు

హైదరాబాద్‌: తెలుగు వారికి రెండు రాష్ట్రాలంటే తప్పేంటన్న బొత్స వాఖ్యలు హృదయంలోంచి వచ్చినవి కాదనీ..యాధృచ్ఛికంగా మాట్లాడారని ఎమ్మెల్సీ పాలడుగు వెంకట్రావు వ్యాఖ్యానించారు. కలిసుండాలా, విడిపోవాలా అన్నది బొత్స చేతుల్లో లేదనీ అధిష్టానంపై ఆధారపడి ఉందన్నారు. ప్రభుత్వం అనే సమస్యలను ఎదుర్కొని క్లిష్టపరిస్థితుల్లో ఉందని, వాటిని ఎదుర్కొని బయటపడాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. భారత రాజ్యాంగానికి అవసరమైన లౌకికవాది ప్రణబ్‌ రాష్ట్రపతిగా ఎన్నికవడం శుభపరిణామమ న్నారు.