బొత్స వ్యాఖ్యల్ని ఖండించిన భాజపా

హైదరాబాద్‌: విద్యుత్‌ ఛార్జీల పెంపుపై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయంటూ బొత్స  సత్యనారాయణ చేసి వ్యాఖన్ని భాజపా ఖండించింది. బాధ్యత గల మంత్రిగా, పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న బొత్స ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేసే విద్యుత్‌ ఛార్జీల తగ్గింపు కోసం ప్రయత్నించకుండా ప్రతిపక్షాలను విమర్శంచడం తగదని భాజపా నేత బండారు దత్తాత్రేయ అన్నారు. విద్యుత్‌ ఛార్జీల పెంపుపై కాంగ్రెస్‌ పార్టీ నేతలు చేస్తున్న విమర్శలు ఆయనకు కన్పించడం లేదా అని ప్రశ్నించారు. విద్యార్థులకు పరీక్షల సమయం దగ్గర పడుతున్నందున కరెంట్‌ కొరత లేకుండా ప్రభుత్వం చూడాలాన్నారు. కార్మికులు, రైతులు, విద్యార్థులు విద్యుత్‌ ఛార్జీల పెంపు వల్ల ఇబ్బందిపడతారని, పెంచిన ఛార్జీలను వెంటనే  తగ్గించాలని ఆయన కోరారు.