బోరు బావిలో చిన్నారి -పుట్టినరోజు నాడే విషాదం

గుర్గావ్‌: తల్లిదండ్రులు, మిత్రులతో కలిసి జన్మదిన వేడుకలను ఆనందంగా జరుపుకున్న నాలుగేళ్ల చిన్నారి అదే రోజు బోరు బావిలో పడిపోయింది. హర్యానాలోని మానేసర్‌ పట్టణం సమీపంలో కషాన్‌ గ్రామంలో ఈ విషాద సంఘటన చోటుచేసుకుంది. చిన్నారి మహీ(4) బుధవారం రాత్రి 11గంటల సమయంలో స్నేహితులతో ఆడుకుంటూ తన ఇంటికి సమీపంలోని బోరు బావిలో పడిపోయిందని ఆమె తండ్రి నీరజ్‌ చెప్పాడు. దాదాపు రెండు గంటలపాటు బావిలోంచి తమ బిడ్డ అర్తనాదాలు వినిపించాయని తెలిపాడు. ప్రస్తుతం బోరు బావిలోంచి ఎలాంటి శబ్ధాలు వినిపించడం లేదు. మహీని రక్షించేందుకు ప్రయత్నాలు పందుకున్నాయి.గురువారం సైనిక సిబ్బంది రంగంలోకి దిగారు. బోరు బావిలోకిఆక్సిజన్‌ను సరఫరా చేస్తున్నారు. బోరు బావికి సమాంతరంగా మరో భారీ గొయ్యి తవ్వుతున్నారు. చిన్నారి పరిస్థితిని తెలుసుకునేందుకు బోరు బావిలోకి కెమెరాను పంపించగా కచ్చితమైన సంకేతాలేవి అందలేదు.